అలరించిన చిన్నారుల నృత్యాభినయాలు
కళలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది : డాక్టర్ అనసూరి పద్మలత
రాజమహేంద్రవరం,
యాంత్రిక జీవనంలో ఆదరణ కోల్పోతున్న సంప్రదాయ భారతీయ కళలను నేటి యువతరం అందిపుచ్చుకోవాలని ప్రముఖ డాక్టర్ అనుసూరి పద్మలత అన్నారు. లాలాచెరువు స్థానిక లాలాచెరువు కేంద్రంగా నడుస్తున్న శివ సాయి కూచిపూడి నృత్య కళాక్షేత్రం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు స్థానిక ఆనం కళా కేంద్రంలో శుక్రవారం కళాక్షేత్రం వ్యవస్థాపకురాలు, నృత్య కళాకారిణి తణుకు సాయి మాధవి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన డాక్టర్ పద్మలత మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులను కళా, సంస్కృతిక రంగాల్లో ప్రవేశం కల్పించి నైపుణ్యం చేసి భారతీయ కళా వారసత్వాన్ని నిలబెట్టాలన్నారు. తాను కూడా కూచిపూడి నృత్య కళాకారిణినేనని, వేడుకలను ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు. కళాక్షేత్రం వ్యవస్థాపకరాలు తణుకు సాయి మాధవి మాట్లాడుతూ, భారతీయ నృత్య కళలు విబిన్నమైన శైలిలో ఉన్నప్పటికీ , అన్నింట్లోనూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మిళితమై ఉంటాయని ఆన్నారు. గత కొంతకాలంగా తాను నృత్య కళల్లో శిక్షణ ఇస్తున్నట్లు, ప్రభుత్వ ,ప్రైవేటు పరంగా మరింత ప్రోత్సాహ సహకారము అందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రారంభంగా చిన్నారుల చేత రంగ పూజ, వాతాడి గణపతి , కూచిపూడి, భరతనాట్యం, జానపద, ప్రదర్శించిన నాట్య రీతుల్లో ప్రదర్శించిన నృత్య భంగిమలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ పోతని శ్రీనివాసు, భాగవతారణి, రమణమూర్తి, చంద్రశేఖర్, ఏ బి శర్మ, తదితరులు పాల్గొన్నారు.