అక్కినేని ఇంట పెళ్లిసందడి దృశ్యాలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య- శోభిత దూళిపాళ్ల వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ ముచ్చటైన వేడుకకు... సినీ ప్రముఖులు చిరంజీవి దంపతులు, వెంకటేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, అల్లు అరవింద్ సహా పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఇప్పటికే పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నాగార్జున. అక్కినేని కుటుంబంలోకి శోభితకు వెల్కమ్ చెప్పారు. అక్కినేని కుటుంబానికి ఈరోజు మరిచిపోలేని రోజన్నారు. శోభిత, నాగచైతన్య కలిసి అందమైన జీవితాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషానిస్తోందన్నారు.