స్థానిక జెండా పంజా రోడ్డులో పునరుద్ధరించిన పార్కును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. రుడా ఆధ్వర్యంలో 11.50 లక్షలతో సదరు పార్కును ఆయన ప్రారంభించారు. అలాగే రుడా ఆధ్వర్యంలో గౌతమీ గ్రంథాలయంలో 33 లక్షలతో నిర్మించిన కాంపౌండ్ వాల్, లైటింగ్ ఆర్చ్, చదువుకునే హాల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్కులు ఉపయుక్తంగా ఉంటాయని, వాటిని అససరాలకు తగ్గట్టు అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ముందుటుందన్నారు. అలాగే గౌతమీ గ్రంథాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ గ్రథాలయంలో లభించే పుస్తలు చదువుకునే ఎంతో పేద విద్యార్ధులు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. ఈ గ్రంథాలయం చాలా ప్రాచీణమైనదన్నారు. చరిత్రలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కాలానుగుణంగా ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పార్టీ నాయకులు, గ్రంథాలయ సిబ్బంది, రుడా అధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.