ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం హామీతో దేశంలోని 860 విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రూ.10 లక్షల వరకు రుణం లభించనుంది. లోన్లో 75% వరకు బ్యాంకులకు కేంద్రం గ్యారంటీ ఇవ్వనుంది. దీనిపై 3 శాతం వడ్డీ రాయితీ ఉండనుంది. ఇందుకోసం కేంద్రం రూ.3,600 కోట్లు కేటాయించనుంది.