DSP యూనిఫాంలో సిరాజ్.. పిక్ వైరల్!


భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా శుక్రవారం ఛార్జ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరక్కు సిరాజ్కు గ్రూప్-1 పోస్టు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ DGPని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు సూటు బూటులో ఉన్న సిరాజ్, ఈరోజు డీఎస్పీగా యూనిఫాం ధరించారు. ఆ పిక్స్ ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఆల్ ది బెస్ట్ మియా అంటూ నెట్టింట ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.