కొత్త టీచర్లకు జీతాల చెల్లింపు ప్రాతిపదిక ఇదే

 


తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా విధుల్లో చేరిన 10వేల మంది టీచర్లకు జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఈ నెల 10వ తేదీని ప్రాతిపదికగా తీసుకుంటామని తెలిపింది. టీచర్లు ఆ తేదీన విధుల్లో చేరి ఉండాలంది. కౌన్సెలింగ్ ఆలస్యమవడంతో ఆలస్యంగా రిపోర్టు చేసిన వారికి ఆయా తేదీల నుంచి జీతం ఇస్తామని పేర్కొంది.