విశాఖ పర్యటనలో భాగంగా నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మంత్రి లోకేశ్ ఉ.9.45 గంటలకూ ఓపెన్ కాకపోవడంపై ఫైరయ్యారు. నిర్వహణ తీరుపై మండిపడ్డారు. గ్రంథాలయాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఓ స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్ను అధ్యయనం చేసి APలో అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.