రాజమహేంద్రంలోని పలు ప్రాంతాలలో అత్యవసర మరమ్మతుల నిమిత్తం గురువారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొంతమూరులోని శ్రీరామనగర్, కళ్యాణ్ నగర్, ఆదర్శనగర్, ఎంప్లాయీస్ కాలనీ, జంగాల కాలనీ, బీసీ కాలనీ, శేషాద్రి లేఔట్, క్వారీ ప్రాంతం, వీవీ కొండయ్య నగర్ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.