సమోసా, చిప్స్, ఫాస్ట్ఫుడ్స్తో డయాబెటిస్


 అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మధుమేహానికి దారి తీస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తేల్చింది. సమోసా, పకోడి, ఫ్రైడ్ చికెన్, చిప్స్, కేక్స్, ఫాస్ట్ ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతున్నట్లు నిర్ధారించింది. ఇవి శరీరంలో హానికరమైన అడ్వాన్స్డ్ గ్లెకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ గా మారి ఇన్సులిన్ నిరోధకతను దెబ్బతీస్తున్నాయి. దీంతో టైప్-2 మధుమేహం, ఊబకాయానికి దారితీస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.