రాజమండ్రిలో సోమవారం ఉదయం నుంచే వర్షాలు


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రిలో సోమవారం ఉదయం నుంచే ఈ వర్షాలు పడుతుండడంతో నగరం అంతా తడిసి ముద్దయింది. జనజీవనం స్తంభించింది. పల్లపు ప్రాంతాలలో భారీగా వర్షపు నీరు చేరుతోంది. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.