సీఎస్కేలో ధోనీకి సరైన వారసుడు పంతే: సైమన్
urria 27, 2024
చెన్నై సూపర్ కింగ్స్ లో ధోనీకి సరైన వారసుడు రిషభ్ పంతేనని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు. 'పంత్ గనుక ఢిల్లీని వదిలేసి వేలంలోకి వస్తే అతడిని దక్కించుకునేందుకు చెన్నై ఎంతవరకైనా వెళ్తుంది. ధోనీ తర్వాత సరైన ప్రత్యామ్నాయం అతడే. మరి రిషభ్ను ఢిల్లీ వదులుకుంటుందా లేదా అన్నది చూడాలి' అని పేర్కొన్నారు. తాను వేలంలోకి వస్తే ఎంత ధర వస్తుందంటూ పంత్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.