అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి తగాదాలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తాళ్ళరేవు మండలం పి.మల్లవరం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా జరిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోరంగి SI సత్యనారాయణ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.