పారదర్శకంగా మద్యం షాపుల లాటరీ ప్రక్రియ

 


తూర్పుగోదావరి జిల్లాలో నూతన మద్యం పాలసీ ద్వారా ఏర్పాటు మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్నవారికి లాటరీ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆ రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రం వద్ద జరిగిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియను పరిశీలించారు. ఒక్కో షాపుకి సగటున 35 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు.