ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో జాబ్ మేళా ఘనంగా పుట్టినరోజు వేడుకలు

 


రాజమహేంద్రవరం, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తమ ఆధ్వర్యంలోని  భవాని చారిటబుల్ ట్రస్ట్ సహాయం అందిస్తుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు హామీ ఇచ్చారు. నిరుద్యోగుల్లో ఉన్న అవాంతరాలను సరిదిద్దడానికి తన వంతు సహాయంగా స్థానికంగా ఉన్న అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ అధినేత అనిల్ సహకారంతో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని అయన తెలిపారు. ఇదే నైపుణ్య శిక్షణ కు  బయట మార్కెట్లో నెలకు రూ.20 వేల రూపాయలు వ్యయం అవుతాయన్నారు. ప్రతి మూడు నెలలకు వందమందికి తమ వంతు సహాయంగా  భవాని ట్రస్ట్ తరఫున  రూ.15,000 రూపాయలు చెల్లిస్తానని సంసిద్ధత వ్యక్తం చేశారు. నైపుణ్య శిక్షణ పొందే అభ్యర్థి కేవలం రూ.5000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా వెబ్ సైట్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.  విద్యార్హత గల నిరుద్యోగి యువత ఈ జాబ్ మేళా ను సద్విని చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం పుట్టినరోజు సందర్భంగా నగర యువత భవిష్యత్తు లక్ష్యంగా  సొంత వ్యయంతో ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నామని తెలిపారు. . దేశంలోని ప్రసిద్ధ సంస్థలకు నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ , పార్మా ,ఐటీ,  కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. 80 కంపెనీలు హాజరు కాగా 6,000 మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు.  తమ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకోక్కటిగా అమలు చేస్తుందని త్వరలోనే నిరుద్యోగ భృతి హామీ ని  అమలు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి పుట్టిన రోజు వేడుకలు పార్టీ నాయకులు కార్యర్తలు మధ్య ఘనంగా  జరిగాయి. ఈ సందర్భంగా ఆది రెడ్డికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి, త వ్వ రాజా, కుడిపూడిసత్తిబాబు,  నక్క దేవి శ్రీ ప్రసాద్ , మలే విజయలక్ష్మి,  జక్కంపూడి అర్జున్, తదితరులు పాల్గొన్నారు.