మద్యం షాపుల లైసెన్స్ కోసం లాటరీ ప్రక్రియ


రాజమహేంద్రవరంలో సోమవారం వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వద్ద మద్యం షాపుల లైసెన్స్ కోసం లాటరీ ప్రక్రియను నిర్వహిస్తునట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి లావణ్య తెలిపారు. ఆదివారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 125 షాపులకు గాను మొత్తం 4,384 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.