వైఎస్ ఫ్యామిలీ ఆస్తులు ఇవే: పేర్ని నాని

 


వైఎస్ మరణించకముందే తన పిల్లలకు ఆస్తులు పంచారని YCP నేత పేర్ని నాని తెలిపారు. 'హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం2లో 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, సండూర్ పవర్ కంపెనీలో వాటా, స్వాతి పవర్ హైడ్రో ప్రాజెక్టులో వాటా, విజయవాడలోని రాజ్-యువరాజ్ థియేటర్లో వాటా, పులివెందులలో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలను షర్మిలకు అప్పజెప్పారు’ అని ఆయన తెలిపారు.