రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేటకు చెందిన పల్లవి (22) ఆదివారం మృతి చెందిందని బొమ్మూరు ఇన్ స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపారు. పీజీ చదువుతున్న పల్లవి బైక్పై తోటి విద్యార్థినితో కలిసి వెళ్తుండగా కాకినాడ డిపోకు చెందిన రాజమహేంద్రవరం నాన్ స్టాప్ బస్సు లాలాచెరువు వద్ద బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పల్లవి తీవ్రంగా గాయపడిందన్నారు.