స్వచ్ఛమైన అఖండ భారతీయ మహిళల్లో మాత్రమే సాక్షాత్తు అమ్మవారి శక్తి నిమగ్నమై ఉంటుంది.మన భారతీయ మహిళల పై వ్యూహత్మకమైన శాస్త్రీయ పరమైన పాశ్చాత్య కుట్రలు జరుగుతున్నాయి. భారతీయ నేలపై జన్మించిన సనాతన స్త్రీ కి జన్మతః ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. గొప్ప శక్తి వంతమైన నేల మన భారతదేశ ధరణి. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రకృతి భారతదేశంలో దాగి వుంది.
భారతీయ స్త్రీలలో అద్భుతమైన వాక్కు శుద్ధి , సంకల్పం , ఆత్మ పరిశుద్ధి , మాతృత్వ దైవ గుణాలు దాగి వున్నాయి . స్త్రీని కాపాడుకోలేని సమాజం ఆ గర్భ దరిద్రాలను , ఆశాంతిని బ్రతికినన్నాళ్ళు మోయాల్సి ఉంటుంది. సనాతన ధర్మం శాస్త్రియతకు అంతుపట్టని మహా శక్తి.కుట్రలో భాగంగా మానవ సంబంధాలను పాడుచేస్తు , ఆర్ధిక సమస్యలు, పేదరికం లోనే భారతీయులు బ్రతికే విధంగా వ్యూహాలు అమలుచేస్తున్నారు.పాశ్చాత్య కుట్రలు అమలుకు భారతదేశంలో గల కార్పొరేట్ వ్యాపార పార్టిలే ముడి సరుకులుగా మారాయి.
మేడా శ్రీనివాస్,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్