అల్పపీడనం భారీ వర్షాలు

 


అల్పపీడన ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.