'ఎన్టీఆర్ బేబీ కిట్' స్కీమ్ తీసుకురానున్న ప్రభుత్వం?

 


గతంలో అమలైన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని కోసం తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఇలాంటి పథకాలను అధికారులు అధ్య యనం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో 2016లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కిట్లో దుప్పటి, దోమతెర, స్లీపింగ్ బెడ్, పౌడర్, లోషన్, న్యాప్కిన్, డైపర్స్ వంటివి ఉంచి బాలింతలకు అందించేవారు.