చలో ఢిల్లీ పోస్టర్ ను ఆవిష్కరణ

 నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విఫలమైందని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబి విమర్శించారు.


నిరుద్యోగుల పట్ల కేంద్రంలోని ఎన్డీయే సర్కారు విధానాలను ఎండగడుతూ ఈ నెల 16 న ఢిల్లీలో జాతీయ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోయే నౌకరీ దేవో నిషానహి కార్యక్రమ పోస్టరును శుక్రవారం రాజమండ్రిలో ఆవిష్కరించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.