విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇరుముడితో విమానంలో ప్రయాణించేందుకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు. జనవరి 20 వరకు అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 20 వరకు ఈ నిబంధన ఉంటుదన్నారు. ఇప్పటి వరకూ భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనివ్వలేదు అధికారులు.. ఇరుముడిని చెకిన్ బ్యాగేజీలో కాకుండా తమ వెంట
తీసుకెళ్లవచ్చంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు.