రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ప్రశాంతి

 



రానున్న 4, 5 రోజులలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన హెచ్చరికల ప్రకారం రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. ఈ మేరకు ఆమె రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను హెచ్చరికలు నేపథ్యంలో చేపట్టవలసిన ముందస్తు సహాయక చర్యల గురించి ఆమె అధికారులకు సూచనలు చేశారు.