నిద్రలోనే ఏడుగురు మృతి

ముంబై చెంబూర్ లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి ఏడుగురు సజీవదహనం అయ్యారు. ఇందులో ముగ్గురు పిల్లలూ ఉన్నారు. మృతులు పారిస్ గుప్తా (7), నరేంద్ర గుప్తా (10), మంజూ గుప్తా (30), ప్రేమ్ గుప్తా (30), అనితా గుప్తా (30), విధి గుప్తా (15), గీతాదేవి గుప్తా (60)గా గుర్తించారు. ఈ ఉ.5.20 గం.కు ఎలక్ట్రిక్ వైరింగ్ కాలిపోయి ఈ ప్రమాదం జరిగిందని, నిద్రలో ఉండటంతో వారు తప్పించుకోలేకపోయారని అధికారులు తెలిపారు.