రేపు తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు

 


తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పించనుంది. ఇటు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 59,140 మంది దర్శించుకోగా 16,937 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు లభించింది.