రాజమహేంద్రవరంలో బసవలింగేశ్వర స్వామికి విశేష హారతులు


రాజమహేంద్రవరం నగరంలోని దేవి చౌక్ వద్ద ఉన్న ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి బుధవారం విశేష హారతులు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో ఈ పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.