శీతాకాలం ప్రారంభం అవుతుండటంతో ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేథార్నాథ్ ఆలయాల మూసివేత తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది. NOV 17న బద్రీనాథ్, కేథార్నాథ్, నవంబర్
3న యమునోత్రి, గంగోత్రి ఆలయ తలుపులను మూసివేయనున్నారు. అలాగే రుద్రనాథ్ ప్రవేశద్వారాలు ఈ నెల 17న క్లోజ్ చేస్తారు. ఈ ఏడాది బద్రీనాథ్ను 11 లక్షల మంది, కేథార్నాథ్ను 13.5 లక్షల మంది దర్శించుకున్నారు. శీతాకాలంలో ఈ ఆలయాలు మంచుతో కప్పబడి ఉంటాయి.