ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్


 తూర్పుగోదావరి జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ విధానం ద్వారా ఏర్పాటు చేయబోయే ఇసుక ర్యాంపులలో ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. ఈ మేరకు ఆమె జిల్లాస్థాయి ఇసుక కమిటీ అధికారులతో రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేటాయించిన 14 ఓపెన్ ఇసుక ర్యాంపుల వివరాలను ఆమె అధికారులకు తెలియజేశారు. వాటి నిర్వహణపై సూచనలు చేశారు.