వ్యక్తి అదృశ్యం కేసు నమోదు


రాజమహేంద్రవరం  ఏసీ గార్డెన్స్ ప్రాంతానికి చెందిన మట్టపర్తి రాజ్ కుమార్ (38) అదృశ్యంపై రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులు శనివారం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ నెల 8వ తేదీన రాజ్ కుమార్ ఇంటి వద్ద నుంచి వెళ్లిపోయాడని అతని కోసం ఎంతగా ప్రయత్నించిన ఆచూకీ లభ్యం కాలేదని కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టామన్నారు.