రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్థానిక 23వ డివిజన్ చందా సత్రం సమీపంలో జరుగుతున్న కల్వర్టు నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిపనులో నాణ్యత ప్రమాణాలు పాటించి అభివృద్ధి పనులు శాశ్వతంగా ఉండేలా చూడాలని సూచించారు. అలాగే నగరంలో జరుగుతున్న సిసి డ్రైనేజీలు, రోడ్లు, కల్వర్టు నిర్మాణాలు స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక టిడిపి నాయకులు యిన్నమూరి ప్రదీప్, పెంటపాటి సుభాష్, శెట్టి జగదీష్, వెంకన్న, జయరాం తదితరులు ఆయన వెంట ఉన్నారు.