ఉచిత గ్యాస్ సిలిండర్ పై సమాచారం

 


దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని  ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతి 4 నెలల్లో లబ్ధిదారులు ఒక సిలిండర్ (ఏడాదికి 3) ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹876గా ఉండగా, ఇందులో రాయితీ ₹25 జమ అవుతోంది. మిగతా ₹851ను సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 24 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్కు శ్రీకారం చుట్టేలా, దీపావళి నుంచి సరఫరాచేసేలా సమాలోచనలు చేస్తోంది.