హైదరాబాద్ లో మరో కొత్త జైలు


హైదరాబాద్ లో మరో కొత్త జైలు చేసేందుకు జైళ్ల శాఖ అధికారులు యోచిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీనిని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీలను చంచల్గూడ జైలుకు తరలిస్తుండటంతో కిక్కిరిసిపోతోంది. 1250 మంది ఖైదీలను ఉంచాల్సిన జైల్లో ఒక్కోసారి 2,000 మందిని ఉంచుతున్నారు. ఆ జైలుపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.