రాచనాగుతో పరాచకాలా..!


తాచుపాముల్ని దూరం నుంచి చూస్తేనే వణికిపోతాం. అలాంటిది తాచుల్ని కూడా భోంచేసే 10-12 అడుగుల రాచనాగుతో సరదాగా పరాచకాలు ఆడేశాడో వ్యక్తి. ఇండోనేషియాలో తీసిన ఈ వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అతడి పేరు పాండ్ అని, పాములు పట్టడంలో నేర్పరి అని ఆ దేశ పౌరులు చెబుతున్నారు. ఎంత నేర్పరి అయినా రాచనాగు తలపై తల పెట్టడమంటే చావు నోట్లో తలపెట్టినట్లేనంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.