ఆ జిల్లాల్లో టమాటా ధర ఒక్కసారిగా పడిపోయిన

 

ధరల విషయంలో  వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న టమాటాలు వాటిని పండిస్తున్న రైతులకు మాత్రం నష్టాన్ని మిగులుస్తున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గాయి. కిలో రూ.20కి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3రోజుల క్రితం కిలో రూ.80-100 పలికిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.