తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటామని తెలిపారు. దుష్ట సంహారం
తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలసి మెలసి జీవించాలన్నదే ఈ పండుగ సందేశమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలంతా చల్లగా చూడాలని దుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు.