త్వరలోనే వైసీపీకి రాజీనామా మాజీ ఎమ్మెల్యే రాపాక
urria 13, 2024
వైసీపీకి త్వరలో రాజీనామా చేస్తానని మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆదివారం తెలిపారు. ఇప్పటికే వైసీపీ అధిష్ఠానానికి విషయం తెలిపానన్నారు. జనసేనలో గెలిచి కొన్ని కారణాలతో వైసీపీలో చేరానన్నారు. వైసీపీ కార్యక్రమాలన్నీ నిర్వహించినా.. తనకు ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్నారు. ఓడిపోతానని తెలిసే వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేశాననన్నారు. వైసీపీకి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.