ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుకు
అడ్డంకులు ఎదురువుతున్నట్లు తెలుస్తోంది. రేషన్ షాపుల విభజన ప్రక్రియ సరిగ్గా జరగడం లేదంటూ కొందరు డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 35 ప్రకారం రేషనలైజేషన్ ప్రక్రియను కొనసాగించడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో షాపుల విభజనను నిలిపేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కొత్తగా 2,774 షాపులు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది.