రేపటి నుంచి నూతన లిక్కర్ పాలసీ షాపుల టైమింగ్స్ ఇవే


ఆంధ్రప్రదేశ్ లో లాటరీలో 3,396 మద్యం షాపుల కేటాయింపు పూర్తవడంతో రేపటి నుంచి నూతన లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలు జరగనున్నాయి. ఇకపై డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని షాపుల యజమానులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.