సికింద్రాబాద్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంఘాలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వారు వాటర్ ప్యాకెట్లు, కుర్చీలు విసిరారు. దీంతో లాఠీఛార్జ్ చోటు చేసుకోగా పలువురు గాయపడ్డారు. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై ఇవాళ హిందూ సంఘాలు సికింద్రాబాద్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.