సాధ్యంకాని హామీలు ఇవ్వబోమని, ప్రతిపక్షంలో ఉండటానికి సిద్ధమేనని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత సెటైర్లు వేశారు. ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటామని ఆయన ఫిక్స్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, విపక్ష హోదాలో ఉండే అర్హత కూడా లేదని చెప్పారు. గత ఐదేళ్లలో టీడీపీ నేతలపై ఎన్నో కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు.