తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారి బి.శ్రీనివాసరావు ఆకస్మిక మృతి ఎంతో బాధాకరం అని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద డీపీవొ శ్రీనివాసరావు మృతికి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది
నివాళులు అర్పించారు. అదేవిధంగా రాజమహేంద్రవరంలోని ఆసుపత్రి వద్ద శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.