నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి నిందితుడి అరెస్టు


ఆత్రేయపురం మండలంలో ఈ నెల 11న ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికను రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన శివ అనే యువకుడు మాయమాటలతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక అమ్మమ్మకు చెప్పింది. ఈ నెల 12వ తేదీన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేసి ఆదివారం శివను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్ఐ రాము తెలిపారు.