ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు: సీఎం చంద్రబాబు నాయుడు


ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని టీడీపీ నేతలను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని, ఎవరూ ధరలను పెంచొద్దని చెప్పినట్లు గుర్తుచేశారు. వీటి విషయంలో ఎలాంటి రాజీ లేదని, రూపాయి కూడా అవినీతి జరగొద్దని స్పష్టం చేశారు. తప్పులు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు. తాను 1995 చంద్రబాబు అని, 2014 సీఎంను కాదని వ్యాఖ్యానించారు.