తమ కూటమి ప్రభుత్వం గత వైకాపా వలే మాటలతో మాయ చేసే ప్రభుత్వం కాదని, ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే చేతల ప్రభుత్వమని రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 31 దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నామన్నారు. మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మంచి పరిపాలన అందిస్తున్నారని, గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్‌ను మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరం పాటు సమయం తీసుకుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్‌ను నాలుగువేలు ఇస్తున్నామన్నారు. ప్రతి నెల ఒకటో తారీఖున లబ్ధిదారులు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని.. ఒకటో తేదీ ఆదివారం పడితే 31వ తారీఖున పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు దీపావళి కానుకగా మూడు గ్యాస్ సిలిండర్లు బుకింగ్ మొదలుకానుందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధికి పరచడానికి ప్రణాళికలు చేస్తోందన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా అందించడానికి ప్రభుత్వంపై రూ. 2,684.75 కోట్ల రాయితీ భారం పడుతుందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈనెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు.