సచిన్ రికార్డును రూట్ బద్దలుగొడతారు.. కానీ..: వాన్


టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన సచిను ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కేవలం 3వేల పరుగుల దూరంలోనే ఉన్నారు. ఆ రికార్డును అందుకునే సత్తా రూటికి ఉందని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ అన్నారు. 'రూట్ కచ్చితంగా ఆ రికార్డును సాధిస్తారు. అయితే దాని కోసం అతడు సుదీర్ఘకాలం ఆడాలి. క్రికెట్ అంటే అతనికి ప్రాణం. కచ్చితంగా అలా ఆడతారనే అనుకుంటున్నా. రూట్ ఇప్పటికే ఓ దిగ్గజం' అని కొనియాడారు.