విజయనగరంలో హృదయవిదారక ఘటన జరిగింది. తల్లి కళ్ల ముందే కుమారుడు ప్రాణాలు వదిలాడు. గంగాధర రావు (30) ఆటో దిగగానే ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమై రోడ్డుపై పడిపోవడంతో తల్లి లేపేందుకు ప్రయత్నించింది. 'నా కొడుకును కాపాడండయ్యా' అని వేడుకున్నా ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకురాలేదు. కి.మీ దూరంలో ఆస్పత్రి ఉన్నా పట్టించుకోలేదు. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో కన్నతల్లి కళ్లెదుటే ప్రాణాలు వదిలాడు.