దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల

 రాష్ట్ర ప్రజలకు మంత్రి కందులు దుర్గేష్

 దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చెడుపై చివరికి మంచే గెలుస్తుందని గుర్తుచేసే రోజు విజయదశమి అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.