అక్రమంగా గంజాయి రవాణా..కేసు నమోదు

 


రాజమహేంద్రవరం, ఆలమూరు ఆల్కాట్ గార్డెనక్కు చెందిన గణేష్, ఇన్నీసు పేటకు చెందిన ప్రసాద్, ఉల్లితోటకు చెందిన దుర్గాప్రసాద్ అనే ముగ్గురు రౌడీషీటర్లు రాజమహేంద్రవరం గూడ్స్ గేట్ వద్ద గంజాయి తరలిస్తుండగా గురువారం టూ టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.