ఆయన అందరికీ మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుతోనే పరిచయం. చిరంజీవి అనే పేరుకి పరిచయం అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా మెగాస్టార్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే చిరంజీవి సినిమాల్లోకి రాకముందు చిరంజీవి కాదు.. ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్. అభిమానులందరికీ మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుతోనే పరిచయం. చిరంజీవి అనే పేరుకి పరిచయం అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా మెగాస్టార్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. అయితే చిరంజీవి సినిమాల్లోకి రాకముందు చిరంజీవి కాదు.. ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్. ఇది కూడా చాలా మందికి తెలుసు. 1978 చిరంజీవి ప్రాణం ఖరీదు చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు నుంచే చిరంజీవికి నటన, డ్యాన్సులు అంటే పిచ్చి. కాలేజ్ డేస్ లోనే చిరంజీవి స్నేహితులతో కలసి నాటకాలు వేసేవారు. ఆ అద్భుతమైన ఒక జ్ఞాపకాన్ని తాజాగా చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి షేర్ చేసిన ఈ ఫోటో ఫ్యాన్స్ కి థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం ఫోటో అది. చిరంజీవి ఈ ఫోటో గురించి కామెంట్స్ లో పేర్కొన్నారు. తాను 50 ఏళ్ళ క్రితం బి కామ్ చదువుకున్న నర్సాపూర్ వైఎన్ ఎమ్ కాలేజ్ లో దిగిన ఫోటో అట అది. రంగస్థలంపై చిరంజీవి తొలిసారి 'రాజీనామా' అనే నాటకం వేశారట. ఈ నాటకంలో చిరంజీవి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. 1974లో చిరంజీవి బి కామ్ చదువుకున్నారు. అప్పుడే తొలి నాటకం వేశారు. అంటే సరిగ్గా 50 ఏళ్ళు పూర్తయింది. ఇదే విషయాన్ని చిరు ప్రస్తావించారు. ఆ అవార్డు గెలుచుకోవడం తనకి ఎనలేని ప్రోత్సాహం ఇచ్చింది అని తెలిపారు. అద్భుతంగా ఉన్న ఈ ఫొటోలో చిరంజీవి నూనూగు మీసాల కుర్రాడిగా గ్లాసెస్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఆ ఫోటో కింద చిరంజీవి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నట్లు రాసి ఉంది. అప్పట్లో కొణిదెల శివశంకర్ వరప్రసాద్ ఇంకా చిరంజీవి గా మారలేదు. కాబట్టి అప్పటికి ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఆ ఫోటో పై కాలేజీ యాజమాన్యం.. Mr. K. S. S. V. Prasada Rao, B.com, బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది కాలేజ్ 1974-75 అని రాసి ఉంది. చిరంజీవి ఒరిజినల్ పేరు, ఫోటో చూస్తూ ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవ్వడం మాత్రమే కాదు.. గూస్ బంప్స్ వస్తున్నాయి అని అంటున్నారు. 50 ఏళ్ళ క్రితం ఉత్తమ నటుడిగా కాలేజ్ లో అవార్డు అందుకున్న చిరంజీవి.. భవిష్యత్తులో సినీ రంగంలో వెలుగు వెలగబోతున్నాడు అనేదానికి పునాది పడింది అక్కడే.