రూ. 43 లక్షల డ్రైనేజీ నిర్మాణం పనులకు శంకుస్థాపన : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

 నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలి

- 9వ డివిజన్లలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పర్యటన


నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. స్థానిక 9వ డివిజన్లో రూ. 43 లక్షల తో చేపట్టిన డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ నగరాభివృద్ధే ధ్యేయంగా తాము పని చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగర అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు. గత ప్రభుత్వంలో ఒక ప్రజా ప్రతినిధి చేపట్టిన అనాలోచిత పనులు కారణంగా ప్రస్తుతం నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ పనులన్నింటినీ సరి చేస్తున్నామన్నారు. కాగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, తప్పని సరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. ప్రజలకు కావాల్సిన అన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు, సమస్యలు దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ పర్యటనలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.